శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 7 : యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు నందన దంపతులపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో కేసు నమోదు కావడంతో ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం నందన లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావడంతో ఆమెను గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు ..ఆదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.