హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ ఎప్పటికప్పుడు సూచిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఫేమ్ కోసం రైలు పట్టాలపై పడుకొని, తనపై నుంచి రైలు పోతుండగా వీడియో తీయించుకున్న ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి యువతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పిచ్చికి పరాకాష్ట.. అంటే ఇదే!?
సోషల్ మీడియాలో పేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు.
రీల్స్ చేసి ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలనే తాపత్రయమే తప్ప.. ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయడం లేదు.
ప్రమాదం జరిగితే తల్లితండ్రులు ఎంతటి… pic.twitter.com/MUOyxuQCiN
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 22, 2025
‘పిచ్చికి పరాకాష్ట.. అంటే ఇదే!. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు. రీల్స్ చేసి ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలనే తాపత్రయమే తప్ప.. ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయడం లేదు.
ప్రమాదం జరిగితే తల్లితండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తారనే సోయి కూడా వీరికి ఉండటం లేదు. సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరం. లేకుంటే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయని.. వీళ్లు ఇంకా మరెన్నో వెర్రి పనులు చేసే ఆస్కారం ఉంది.’ అని సజ్జనార్ హెచ్చరించారు.