Cyber Crime | వినాయక చవితి ఉత్సవాల లక్కీడ్రాలో మీ పేరు వచ్చింది.. తపాలాశాఖ పేరిట సైబర్ పేరుతో సైబర్ మోసగాళ్ల కొత్త దందా
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇండియా పోస్ట్ నిర్వహించిన లక్కీడ్రాలో మీ పేరు వచ్చింది. ఈ లక్కీడ్రాలో మీరు ఐఫోన్ 15ని గెలుపొందారు. ఈ రివార్డును ైక్లెమ్ చేసుకోవడానికి ‘క్లిక్ అండ్ కంటిన్యూ’ బటన్ ప్రెస్ చేయండి’ అంటూ సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరతీశారు.
Cyber Crime | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇండియా పోస్ట్ నిర్వహించిన లక్కీడ్రాలో మీ పేరు వచ్చింది. ఈ లక్కీడ్రాలో మీరు ఐఫోన్ 15ని గెలుపొందారు. ఈ రివార్డును ైక్లెమ్ చేసుకోవడానికి ‘క్లిక్ అండ్ కంటిన్యూ’ బటన్ ప్రెస్ చేయండి’ అంటూ సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరతీశారు. ‘ఇండియా పోస్ట్ వినాయక చవితి సందర్భంగా ఐఫోన్-15ను గిఫ్టుగా ఇస్తున్నది. దీనికో సం ఈ సమాచారాన్ని 5 వాట్సాప్ గ్రూ పుల్లో ఫార్వర్డ్ చేయాలి’ అంటూ క్లోనింగ్ చేసిన (సైబర్ నేరం చేసేందుకు వీలుగా ఉండే) ఇండియాపోస్టు వెబ్సైట్ పేరిట ఉండే పోస్ట్‌ను ఫార్వర్డ్ చేయిస్తున్నారు. ఈ మెస్సేజ్ ‘ఇండియా పోస్ట్’ నుంచే వచ్చిందనే భ్రమలో కొందరు అమాయకులు ఈ కొత్త తరహా మోసాల బారిన పడుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, తాము ఎవరికీ బహుమతులు ఇవ్వబోమని ఇండియా పోస్ట్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వివరణ ఇచ్చింది.
క్లెయిమ్‌పై క్లిక్ చేస్తే నష్టపోయినట్టే
సైబర్ నేరస్తులు పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఇలాంటి మోసాలకు తెగబడ్తా రని, అప్రమత్తతే ఆయుధమని సైబర్ సెక్యూరిటీ పోలీసులు చెబుతున్నారు. వీటిని క్లిక్ చేస్తే డబ్బులు కొల్లగొడతారని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాలబారిన పడినవారు 1930కి కాల్ చేయాలని, cybercrime.gov.inలో ఫిర్యా దు చేయాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

