సైదాబాద్, ఆగస్టు 5 : గంజాయికి అలవాటుపడ్డ యువకుడు ఎక్సైజ్ పోలీసులను చూ సి భయంతో పారిపోతుండగా ప్రమాదవశా త్తు మృతిచెందాడు. పోలీసులు వెంబడించ డం వల్లే చనిపోయాడని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు చంపాపేటలో సోమవారం రాస్తారోకో చేశారు. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణికాలనీలో జరిగిన ఘటనపై ఎక్సైజ్ పోలీసులు, బాధిత కు టుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మత్తు పదార్థాల ద్వారా కలిగే నష్టాలపై అవగాహన కలిగించేందుకు సింగరేణికాలనీలోని వాంబే గృహాల్లో మలక్‌పేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జే గోపాల్‌నాయక్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఇదే కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ ఖలీం పాషా(28), పోలీసులను చూసి తనను పట్టుకునేందుకే వ చ్చారని భావించి వాంబే క్వార్టర్పైకి ఎక్కా డు. మూడంతస్థుల భవనంపై నుంచి డ్రైనేజీ పైప్‌లైన్ సాయంతో దిగే ప్రయత్నంలో జారిపడి గాయపడ్డాడు. కుటుంబసభ్యులు చంపాపేటలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గోపాల్ నాయక్ సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఘటన విషయాన్ని తెలిపారు. ఖలీం పాషా పరిస్ధితి విషమించటంతో ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందు తూ సోమవారం ఉదయం చనిపోయాడు.
కుటుంబసభ్యుల రాస్తారోకో
పోలీసులు వెంబడించడం వల్లే పాషా పారిపోయే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగా రు. మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చంపాపేటలో రాస్తారోకో చేశారు. న్యాయం జరిగేలా చూస్తామని సైదాబాద్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ హామీ ఇవ్వటం తో ఆందోళన విరమించారు. పాషాపై ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసులు లేవ ని ఎక్సైజ్, ప్రోహిబిషన్ హైదరాబాద్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు తెలిపారు. సిబ్బంది వెంబడించలేదని, పోలీసులను చూసి భయంతో పారిపోతుండగానే ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పారు.