న్యూఢిల్లీ, జనవరి 23: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్స్ 3 లక్షల స్కూటర్లను వెనక్కి పిలిపిస్తున్నట్టు ప్రకటించింది. రేజెడ్ఆర్ 124 ఎఫ్ఐ హైబ్రిడ్, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్లలో బ్రేక్ పార్ట్‌కు సంబంధించి సమస్యలు తలెత్తడంతో రీకాల్ చేయాలని నిర్ణయించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మే 2, 2024 నుంచి సెప్టెంబర్ 3, 2025 లోపు తయారైన ఈ స్కూటర్లలో ముందు బ్రేక్ సమస్యలు తలెత్తాయని, ఈ విషయాన్ని కొనుగోలుదారులకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొంది. అవసరమైన స్కూటర్లలో విడిభాగాలను ఉచితంగా రీప్లేస్ చేయనున్నది.