హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాల్లో ప్రవేశించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) తాజాగా ఎన్నికల రంగంలో హల్చల్ చేస్తున్నది. ఆయా రాజకీయ పార్టీలు తమ నాయకుల ఫొటోలను ఏఐ సాయంతో మెరుగులు దిద్దుతున్నారు. తాజాగా ఏఐ సాయంతో రూపుదిద్దుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటో పార్టీ శ్రేణులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.
ఈ ఫొటోను బీఆర్ఎస్ అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
సాధారణ పొలిటికల్ పోస్టర్లు, ఫొటోలకు భిన్నంగా కనిపిస్తున్న ఈ చిత్రాలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. కేసీఆర్ ఏఐ ఫొటోలకు అనూహ్య స్పందన రావడంతో.. వాటిని పార్టీ అధికారిక ఖాతాలకు ట్యాగ్ చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన ఏఐ ఫొటోలు సామాన్యులను సైతం ఆకట్టుకుంటుండగా.. కేసీఆర్‌ను కొత్తగా చూపే మేకోవర్‌కు ఆయన అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూనే, వాట్సాప్ స్టేటస్‌గా, డీపీలుగా, వాల్‌పోస్టర్లుగా పెట్టుకొని మురిసిపోతున్నారు.