యాదగిరిగుట్ట, మార్చి16 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన హుండీఆదాయం రూ.2,55,83,999 వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు.
గురువారం యాదాద్రి కొండకింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో 30 రోజుల హుండీలను లెక్కించినట్టు చెప్పారు. నగదుతోపాటు 91 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 650 గ్రాముల మిశ్రమ వెండి సమకూరిందని, దాంతోపాటు విదేశీ కరెన్సీ కూడా భారీగా వచ్చిందని వెల్లడించారు.