యాదాద్రి, డిసెంబర్ 17 : యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడికి నిత్యపూజలను వైభవంగా నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చక బృందం సుప్రభాతాన్ని ఆలపించి స్వామివారిని మేల్కొలిపారు. స్వామి, అమ్మవార్లకు తిరువారాధన జరిపి, బాలభోగం నివేదన చేపట్టారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో స్వామివారికి నిత్య సుదర్శన నారసింహ హవనం జరిపారు. స్వామి, అమ్మవార్లకు గజవాహన సేవ, నిత్య తిరుకల్యాణోత్సవం పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో సాగింది. 22 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు రూ. 26,38,054 ఆదాయం సమకూరింది.