యాదాద్రి, అక్టోబర్ 7 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొన్నది. మాడ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరుమాడ వీధుల్లో భక్తుల రద్దీ కనిపించింది. కొండ కింద దీక్షాపరుల మండపం వద్ద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తుల వాహనాలతో కొండపైన పార్కింగ్ ప్రాంతాలు నిండిపోయాయి. స్వామివారిని 13,978 మంది దర్శించుకోగా, ఖజానాకు రూ.29,61, 251 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు. స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి, సినీ దర్శకుడు అల్లాణి శ్రీధర్ దర్శించుకున్నారు.