యాదగిరి గుట్ట, యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాన సలహాదారుడిగా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్(Somesh Kumar) బుధవారం యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామి (Yadagirigutta, Laxminarasimha swamy)ని సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదల ప్రకారం అర్చకులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సోమేశ్‌కుమార్ దంపతులను సన్మానించారు.
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్(CM KCR) కు ప్రధాన సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ మూడు సంవత్సరాల పాటు పదవిలో ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.