రామచంద్రుడు తాక రాయి రమణిగా మారె..
శిల్పి చేయి తగిలి శ్రీహరాయెను శిలలు..
రాగాలు పలికేటి రామప్ప శిల్పాలు..
వేల వేళ్లు చెక్కె వేయి స్తంభాలను..
ఉలి తగలగానె శిలలూపిరోసుకునెను..
కఠిన శిల సైతమూ కదిలే ప్రాణాలతో..
తొలి దెబ్బకే శిలలు తోరణాలయ్యాయి..
మలి దెబ్బకే శిలలు మండపాలయ్యాయి..
కోటి దెబ్బలు తిని కోవెలాయెను కొండ..
లక్ష్మీ నరసింహుడే కొలువాయె కోవెలలో..
యాదాద్రి జక్కన్నలు చెక్కగా చక్కగా..
శిలను శిల్పము చేసి చరితనిల్చెను శిల్పి..
విశ్వకర్మ సైతమూ విస్తుపోయే విధము..
ప్రతి యాదాద్రి శిల్పమొక
వేదం..నాదం..మోదం..మోక్షం..
చరితార్థమగును సీఎం చంద్రశేఖరుని స్ఫూర్తి..
అజరామరమై వెలుగు
యాదాద్రి శిల్పుల కీర్తి…
– డాక్టర్ వంగ చక్రపాణి, ప్రిన్సిపాల్, మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల
9849558058