యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా రోడ్లను సుందరంగా తీర్చిదిద్దారు. రోడ్డు మధ్యలో పచ్చని చెట్లు, ఇరువైపులా ల్యాండ్ స్కేపింగ్, ఫుట్‌పాత్‌లను నిర్మించారు. రాయగిరి కమాన్ నుంచి యాదాద్రి వైకుంఠ గోపురం వరకు 281 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి రాయిగిరి చెరువుకట్ట వద్ద 100 లైట్లను ఆన్‌చేసి ట్రయల్ రన్ నిర్వహించగా జిగేల్మంటూ కనువిందు చేశాయి.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నమస్తే తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా