యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారు శ్రీమహావిష్ణు (Sri Mahavishnu) అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. విష్ణుమూర్తి అలంకారంలో గరుడ వాహనంపై బాలాలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు.
వజ్ర వైఢూర్యాల ధరించిన స్వామివారు ఆలయ తిరువీధులో ఊరేగుతూ దగదగ మెరిసిపోయారు. రాత్రి 7 గంటలకు బాలాలయంలో బంగారు రథంపై రథోత్సవం నిర్వహించనున్నారు. అయితే ఈ నెల 28 నుంచి ప్రధానాలయంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారికి సర్ణరథంపై బాలాలయంలో ఊరేగింపు నిర్వహించడం ఇదే మొదటి, చివరిసారి కానుంది.