రాజన్న సిరిసిల్ల, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ సౌత్ ఇండియన్ షార్ట్ స్టోరీ మీట్‌కు ఎంపికయ్యారు. చెన్నైకి చెందిన సాహిత్య అకాడమీ ఎస్సార్ ఇన్స్టిట్యూట్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తం గా ఏటా దక్షిణ భారత కథా రచయితల సమ్మేళనం నిర్వహిస్తుండగా, దీనికి కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన కథారచయి తలు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 3న నిర్వహించే సమ్మేళనానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పెద్దింటిని ఎంపిక చేసి ఆహ్వానించారు.
ఈ వేదికగా ఆయన ‘తెలంగాణ మట్టి జీవితాలు’ కథలను వినిపించనున్నా రు. సిరిసిల్ల అర్బన్ మండలం రాజీవ్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన, ఎన్నో కథలు రాశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం సినిమా కథలు కూడా రాస్తున్నారు.