భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్‌లో 20 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు గురువారం ఖాళీ బిందెలతో ఖమ్మంకొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారులకు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు. ఎస్సై జీవన్‌రాజు వచ్చి ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.