హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని భగవాన్ మహవీర్ ఆడిటోరియం, స్టేట్ మ్యూజియంలో సోమవారం నుంచి వరల్డ్ హెరిటేజ్ వేడుకలను నిర్వహించనున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 వరకు జరిగే ఈ వేడుకల సందర్భంగా స్మారక చిహ్నాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఆగాఖాన్ ట్రస్ట్, దక్కన్ హెరిటేజ్ అకాడమీ, సిటీ కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో కుతుబ్‌షాహీ టూంబ్స్ నుంచి సాయిదానిమా టూంబ్స్ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నట్టు తెలిపారు. సిటీ కాలేజీ విద్యార్థులకు వ్యాసరచన, పాఠశాలల విద్యార్థులకు డ్రాయింగ్, స్కేటింగ్ పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.