హైదరాబాద్ సిటీ బ్యూరో: దక్షిణ కొరియాలోని జెజులో ఇటీవల జరిగిన వేడుకల్లో వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డ్-2022 హైదరాబాద్‌కు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల బృందం బుధవారం ప్రగతిభవన్‌లో పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిసింది. ఈ సందర్భంగా వారు గ్రీన్‌సిటీ అవార్డుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. కేటీఆర్‌ను కలిసిన బృందంలో ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ సంతోష్, అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ ప్రభాకర్, సీఐవో హరినాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.