హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ విద్యార్థులకు పరిశోధన విధానాలు, థిసీస్ రూపకల్పన, నాయకత్వ, జీవన నైపుణ్యాలు వంటివి పెంపొందించ డమే లక్ష్యంగా జేఎన్టీయూలో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీలో కం ప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగం హెచ్‌వోడీ డాక్టర్ కే సుప్రీతి ఆధ్వర్యంలో రెండు రోజులుగా టెక్ వర్క్‌షాప్‌లతో నిర్వహించిన క్వెస్ట్ 2024 కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి ఫెస్ట్‌లు, వర్క్‌షాపులు విద్యార్థులలో సాంకేతిక పరిశ్రమలో నిరంతర అభ్యాసం, ప్రాముఖ్యతను నొక్కి చెబు తాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు విలువైన, ఆచరణాత్మకమైన అనుభవాన్ని అందించాయని సుప్రీతి పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్‌లకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచి దాదాపు 300 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో కూడా మరికొన్ని అంశాలపై క్వెస్ట్ ప్రోగ్రాంలు జరుగుతాయని పేర్కొన్నారు.