గుమ్మడిదల, మార్చి 23: మహిళను హత్య చేసిన నకిలీస్వామిజీని పోలీసులు రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పరిధిలోని వీరన్నగూడెంకు చెందిన బుచ్చమ్మకు.. యాదాద్రి భువనగిరి జిల్లా వెంకిర్యాలకు చెందిన తత్తరి నర్సింగ్రామ్ శివ స్వామిజీగా పరిచయమయ్యాడు. పూజలు చేస్తానని నమ్మించి గత నెల 13న బుచ్చమ్మ (60)ను సికింద్రాబాద్ తీసుకెళ్లి పూజ సామాన్లను కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి ఘట్కేసర్ పరిధి మాదారం శివారులో పూజలు చేస్తున్నట్టు నటిస్తూ బంగారు గొలుసును తీయాలని అడగగా.. ఆమె నిరాకరించింది. దీంతో బుచ్చమ్మను చంపి బంగారు గొలుసుతో పారిపోయాడు. పోలీసులు నకిలీ స్వామీజీని పట్టుకుని రిమాండ్కు తరలించారు.