చిట్టీ డబ్బులు అడిగాడని నిప్పంటించింది

వ్యక్తిపై పెట్రోల్‌పోసి సజీవ దహనానికి యత్నం
హనుమకొండలో చిట్టీ ఏజెంట్ భార్య ఘాతుకం
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 3: చిట్టీ డబ్బులు ఇవ్వాలని కోరిన వ్యక్తిపై ఓ మహిళ పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన శుక్రవారం హనుమకొండలో కలకలం రేపింది. బాధితుడు, పోలీసుల వివరాల ప్రకారం.. హనుమకొండ కాంగ్రెస్ భవన్ ఎదుట కొన్నేళ్లుగా పిట్టల రాజు శ్రీసెల్ వరల్డ్ మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. హనుమకొండలోని అచల చిట్‌ఫండ్‌లో రాజు రూ.5 లక్షల చిట్టీ వేస్తున్నాడు. ఏజెంట్ గొడుగు గణేశ్‌కు డబ్బులు కట్టేవాడు. మధ్యలో చిట్టీ ఆపిన రాజు తన డబ్బులు ఇవ్వాలని కోరాడు. నెలల తరబడి చిట్‌ఫండ్ యాజమాన్యం, ఏజెంట్ గణేశ్ డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్నారు. దీంతో శుక్రవారం నక్కలగుట్టలోని చిట్‌ఫండ్ బ్రాంచికి వెళ్లి ఆందోళన చేశాడు. దాన్ని మనసులో పెట్టుకొని ఏజెంట్ గణేశ్ తన భార్య కావ్య ద్వారా రాజును సజీవదహనం చేయించేందుకు వ్యూహం రచించాడు. పథకంలో భాగంగా సాయంత్రం 4 ప్రాంతంలో షాపులోకి వచ్చిన కావ్య.. ఒక్కసారిగా బ్యాగులో నుంచి పెట్రోల్ బాటిల్ తీసి రాజుపై పోసి నిప్పంటించింది. అక్కడి నుంచి పరారైంది. మంటలతోనే కేకలు వేస్తూ రాజు బయటకు పరుగులు తీశాడు. మంటలు ఆర్పే ప్రయత్నంలో ఎదురుగా ఉన్న పాన్‌షాపు యజమాని రంగయ్య కూడా గాయాలపాలయ్యాడు. స్థానికులు నీళ్లుపోసి మంటలను ఆర్పివేసి దవాఖానకు తరలించారు. అగ్నిమాపకశాఖ సిబ్బంది ఫైరింజన్‌తో అక్కడికి చేరుకుని దుకాణంలో మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం రాజు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. విషయం తెలుసుకున్న హనుమకొండ సీఐ వేణుమాధవ్ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Chit Fund
- Hanamkonda
- Petrol
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

