హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): దేశంలో విద్యాశాఖ మంత్రు ల కిస్మత్ బాగా లేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితులు, వివి ధ కారణాలతో ఇప్పటికే రాజీనామా చేసి న స్మృతి ఇరానీ, రమేశ్ పోక్రియాల్, ప్రకాశ్ జవదేవకర్, ధర్మేంద్ర ప్రధాన్ల ఉదంతాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కనీసం ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి కిస్మత్ అయినా బాగుండాలని కోరుకుంటున్నాను. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కనిష్ఠ వయోపరిమితిని 25 నుంచి 21 ఏండ్లకు, రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కనిష్ఠ వయోపరిమితిని 30 నుంచి 25 ఏండ్లకు తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ అంశంపై సమగ్ర చర్చ నిర్వహించేందుకు ఆగస్టులో తెలంగాణ శాసనసభ, మండలి సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఆదివారం జాతీయ మీడియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజన , పార్లమెంటు సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లతోపాటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కనిష్ఠ వయోపరిమితిని తగ్గించే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు.