Medigadda | జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద శుక్రవారం జరిగిన మంత్రుల సమావేశంలో గ్రామ సర్పంచ్‌కు ప్రాధాన్యం కరువైంది. లక్ష్మీబరాజ్‌లో పిల్లర్ల కుంగుబాటుపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కొనసాగుతున్నంత సేపు మంత్రులు, అధికారులు కుర్చీల్లో కూర్చోగా ఆ గ్రామ ప్రథమ పౌరుడు (సర్పంచ్) ఎర్రవెల్లి విలాస్‌రావు మాత్రం వెనుకవైపు నిల్చుని కనిపించారు. అలాగే వేదికపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫొటో పెట్టకపోవడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.