Chandrayaan-3 | చంద్రయాన్-3 ప్రయోగంలో ఆ 20 నిమిషాలు ఎందుకు అంత కీలకం ?
Chandrayaan-3 | చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియ సరిగ్గా సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభమై 6.04 గంటలకు ముగుస్తుందని అంచనా. దీనినే ‘20 నిమిషాల టెర్రర్’గా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్ మాడ్యూల్ సరైన ఎత్తులో, సరైన సమయంలో సరిపడా ఇంధనాన్ని వినియోగించుకొని తనకు తానుగానే ఇంజిన్లను మండించుకోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్ : చంద్రయాన్-3 ( Chandrayaan-3)ల్యాండింగ్ ప్రక్రియ సరిగ్గా సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభమై 6.04 గంటలకు ముగుస్తుందని అంచనా. దీనినే ‘20 నిమిషాల టెర్రర్’గా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్ మాడ్యూల్ సరైన ఎత్తులో, సరైన సమయంలో సరిపడా ఇంధనాన్ని వినియోగించుకొని తనకు తానుగానే ఇంజిన్లను మండించుకోవాల్సి ఉంటుంది.
ఎత్తుపల్లాలు లేని ఉపరితలంపై దిగే ప్రాంతాన్ని కూడా కెమెరాతో స్కాన్ చేసుకొని దిగుతుంది. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రతి అడుగు కీలకమే. చంద్రుని ఆకర్షణశక్తికి అనుగుణంగా ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకుంటూ వేగాన్ని తగ్గించుకుంటుంది. ఆ తరువాత 11 నిమిషాలపాటు రన్ బ్రేకింగ్ దశ మొదలవుతుంది.
ఈ దశలో ల్యాండర్ చంద్రునికి సమాంతరంగా నిలుస్తుంది. క్రమంగా ఫైన్ బ్రేకింగ్ దశలోకి వస్తుంది. దిగేందుకు అనువుగా ల్యాండర్ 90 డిగ్రీల వంపు తిరుగుతుంది. క్రితంసారి చంద్రయాన్-2 ఈ దశలోనే కూలిపోయింది. ఈ దశల అనంతరం ల్యాండర్ చంద్రునికి కేవలం 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అప్పుడు దాని వేగం సున్నాకు చేరుతుంది.
అలా మెల్లిగా 150 మీటర్ల ఎత్తుకు చేరగానే దిగేందుకు సరైన ప్రదేశం కోసం ల్యాండర్ వెతుకుతుంది. అనువైన స్థలం దొరకకగానే అక్కడ సెకనుకు మూడు మీటర్ల వేగంతో చంద్రుని ఉపరితలాన్ని తాకుతుంది. ఈ విధంగా చివరి 20 నిమిషాల ఉత్కంఠకు తెరపడి మిషన్ విజయవంతం అవుతుంది. ఆ తర్వాత 14 రోజుల పాటు మామ ఇంట గడుపుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- chandrayaan-3
- ISRO
- landing
- Moon
RELATED ARTICLES
తాజా వార్తలు
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

