హైదరాబాద్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): ఆయిల్‌ఫెడ్ ఎండీ ఎవరు? అనేది ప్రస్తుతం ఆయిల్‌ఫెడ్ వర్గాలను అయోమయానికి గురిచేస్తున్నది. ప్రస్తు త ఎండీ శంకరయ్యను ప్రభుత్వం గత నెల 16న బదిలీ చేసింది. ఆయన స్థా నంలో ఆదిలాబాద్ జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డిని కొత్త ఎండీగా నియమించింది. అయితే బదిలీ జరిగి 20 రోజులవుతు న్నా పాత ఎండీ పోలేదు.. కొత్త ఎండీ రాలేదు. దీంతో అసలేం ఏం జరుగుతుందో అర్థంకాక ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు.
కొత్త ఎండీ రాకపోవడంతో పాత ఎండీ శంకరయ్య ను కొనసాగిస్తున్నారా? అసలు ఆయన బదిలీ జరిగిందా? లేదా?.. కొత్త ఎండీ వస్తారా? రారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జితేందర్‌రెడ్డి మాత్రం జడ్పీ సీఈవో పోస్టు నుంచి ఎప్పుడో రిలీవ్ అ య్యారు. కానీ, ఇక్కడ మాత్రం జాయిన్ కాలేదు. 20 రోజులైనా జాయిన్ కాకపోవడంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయిల్‌ఫెడ్ ఎండీ నియామకంపై మంత్రి తుమ్మల అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. మూడు నెలల క్రితం శంకరయ్య నియామకం, ప్రస్తుతం జి తేందర్‌రెడ్డి నియామకం మంత్రికి తెలియకుండానే జరిగినట్టు చర్చ జరుగుతున్నది. ఆయిల్‌ఫెడ్ ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించాలనే ఆలోచనలో మంత్రి ఉన్నట్టు తెలిసింది.
‘ఆయిల్‌ఫెడ్’ పై దర్యాప్తు చేపట్టాలి: జూలకంటి
రఘునాథపాలెం, అక్టోబర్ 5 : ఆయిల్‌ఫెడ్ సంస్థలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేప ట్టి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, లేనిపక్షంలో ఉధృత పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే, రైతు నేత జూలకంటి రంగారెడ్డి ప్ర భుత్వాన్ని హెచ్చరించారు. ఆదివా రం ఖమ్మం నగరంలోని స్వర్ణభారతి కల్యాణ మండపంలో ఆయిల్‌పామ్ రైతుల రాష్ట్ర సదస్సులో ఆయన మా ట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ సాగు విషయంలో రైతులకు సలహాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. దేశం లో 50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం నెరవేరాలంటే కేంద్రం కనీస మద్దతు ధర టన్నుకు రూ.25 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. బహుళ జాతి సంస్థల ఒత్తిడికి లొంగిన ప్రభుత్వా లు పామాయిల్, పత్తి దిగుమతి సుంకం తగ్గించడం, పూర్తిగా ఎత్తివేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఆయిల్‌ఫెడ్ రైతులకు సరఫరా చేసే మొక్కలు జన్యుపరమైన లోపంతో గెలలు రాక ఏడేండ్లు పెంచి తోటలు తొలగించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వం విచారణ చేపట్టి నష్టపరిహారం అందించాలన్నారు.