వినాయక్‌నగర్, ఆగస్టు 24: పౌర సమాజంలో ఎక్కడ వివాదాలు ఉంటా యో, పరిష్కారాలు కూడా అక్కడే దొరుకుతాయని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ సుజోయ్‌పాల్ అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడురోజుల శిక్షణ ము గింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు.
మనుషుల మధ్య తలెత్తిన వివాదా లు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే వీలున్నదని తెలిపారు. వృద్ధులైన తల్లిదండ్రులను పోషించని వారి సంతానం మధ్యవర్తిత్వ భాషను అర్థం చేసుకోవాలని సూచించారు.
భవనానికి పునాది ఎంత బలమైనదో మధ్యవర్తిత్వానికి కమ్యూనిటీ మీడియేటర్లు అంత బలమై న వారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే శ్రీనివాస్ రావు అన్నారు. మనుషుల మధ్య నెలకొన్న చిన్న, చిన్న విభేదాలు మొదటి దశలోనే తుంచి వేయాలని సూచించారు.
కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ మాట్లాడుతూ లోక్ అదాలత్, మధ్యవర్తిత్వ వ్యవస్థలలో కమ్యూనిటీ మీడియేటర్లు ప్రధాన భూమిక పోషించాలని కోరారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి పంచాక్షరి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, ఇతర జడ్జీలు పాల్గొన్నారు.