గ్రామాల రూపురేఖల్లో మార్పేది?: మంత్రి సీతక్క
రాష్ట్రంలోని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో సుమారు 1.35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.. ఏటా రూ.34 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చవుతున్నాయి.. భారీ యంత్రాంగం, నిధులు ఉన్నప్పటికీ గ్రామాల రూపురేఖలు ఆశించిన స్థాయిలో ఎందుకు మారడం లేదు? అని మంత్రి సీతక్క అధికారులను ప్రశ్నించారు.
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో సుమారు 1.35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.. ఏటా రూ.34 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చవుతున్నాయి.. భారీ యంత్రాంగం, నిధులు ఉన్నప్పటికీ గ్రామాల రూపురేఖలు ఆశించిన స్థాయిలో ఎందుకు మారడం లేదు? అని మంత్రి సీతక్క అధికారులను ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం పల్లెల ప్రగతికి వేల కోట్లు వెచ్చిస్తున్నా ఫలితమెందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామాల అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదని, గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే అసలు అభివృద్ధి అని తెలిపారు. మంగళవారం ప్రజాభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, మిషన్ భగీరథ, సెర్ప్, ఉపాధి హామీ పథకం తదితర విభాగాల అధికారులతో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యాదేవరాజన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

