హైదరాబాద్, అక్టోబర్5 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ సొసైటీ అడిషనల్ సెక్రటరీ హన్మంత్నాయక్ను ప్రభుత్వం ఉన్నపళంగా తప్పించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వాస్తవంగా ఎస్సీ అభివృద్ధిశాఖ హన్మంత్‌నాయక్ పేరెంటల్ డిపార్ట్మెంట్ కాగా, ఎస్సీ గురుకుల సొసైటీలో అడిషనల్ సెక్రటరీగా విధులను నిర్వర్తిస్తున్నారు. సొసైటీ కీలక విభాగాలన్నీ ఆయన పర్యవేక్షణ కిందనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సొసైటీలో జరిగిన బదిలీలు, పదోన్నతులు అనేక వివాదాలకు తెరలేపింది. సొసైటీ టీచర్లు ఏకంగా ప్రజాభవన్ వద్దకు వెళ్లి ధర్నాలకు దిగారు. సొసైటీ ఉద్యోగులే కాదు ఏడీ హన్మంతనాయక్పై మాదిగ, మాల, లంబాడ వర్గాలకు చెందిన పలు సంఘాల నేతలు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారని తెలుస్తున్నది.
సొసైటీలోని కొందరు ఉద్యోగులు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి హన్మంతునాయక్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనపై ఏసీబీ కేసు పెట్టాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఆ ఫిర్యాదులను ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని లోతుగా విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉన్నపళంగా వేటు వేసి, పోస్టింగ్ ఇవ్వలేదని సొసైటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీఎంఆర్ఎఫ్కు ఎస్సారార్ 50 లక్షల విరాళం
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తేతెలంగాణ): వరద బాధితుల సహాయార్థం ఎస్సారార్ అనే రియల్ఎస్టేట్ ప్రైవేట్ కంపెనీ రూ. 50 లక్షల విరాళం అందజేసింది. శనివారం కంపెనీ ప్రతినిధులు అల్లూరి శ్రీనివాస్, పరుచూరి మురళీకృష్ణ, కేఎస్ రామారావు, ఎం చంద్రారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి చెక్కును అందించారు. వీరిని ముఖ్యమంత్రి అభినందించారు.