హైదరాబాద్ జూన్ 9 (నమస్తేతెలంగాణ): ‘మంత్రివర్గంలో లంబాడీలకు చోటేది?.. ముఖ్యమంత్రికి మా వర్గం అంటే చిన్నచూపు ఎందుకు?’ అని టీఎస్జీజీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ ప్రశ్నించారు. మంత్రిపదవి ఇవ్వకుండా లంబాడీలను మోసం చేశారని సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం లేని అగ్రవర్ణాలకు ఏడు మంత్రి పదవులు కేటాయించడం విడ్డూరమన్నారు.
డిప్యూటీ స్పీకర్ పదవిని రాంచంద్రునాయక్కు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. ఆయన ఆ పదవిని తీసుకోవద్దని డిమాండ్ చేశారు. అడుగడుగునా అన్యాయం చేస్తున్న హస్తం పార్టీకి బుద్ధిచెప్పేందుకు భవిష్యత్లో ‘కాంగ్రెస్ హఠావో-బంజార బచావో’ పేరిట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.