ఖైరతాబాద్, డిసెంబర్ 8: రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన క్యాబినెట్లో లంబాడాలకు స్థానం కల్పించకపోవడం బాధాకరమని సేవాలాల్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, గిరిజన రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్, ఎల్‌హెచ్‌పీఎస్ అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ రావడానికి లంబాడాల ఓట్లు కీలకమయ్యాయని, ప్రమాణస్వీకారోత్సవంలో వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీతక్కకు మంత్రి పదవి ఇచ్చినా గిరిజనులకు ఇచ్చినట్టు కాదని స్పష్టం చేశారు. శాసనసభ, శాసన మండలిలో ఒక్క గిరిజన ప్రతినిధికి కూడా భాగస్వామ్యం కల్పించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.