బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 12:52:19

ట్రాన్స్‌జెండ‌ర్స్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: సైబ‌రాబాద్ సీపీ

ట్రాన్స్‌జెండ‌ర్స్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: సైబ‌రాబాద్ సీపీ

హైద‌రాబాద్‌: క‌రోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ వారికి నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేయ‌డం సంతోషంగా ఉంద‌ని సైబరాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌ చెప్పారు. క‌రోనాతో ఇబ్బందులు ప‌డుతున్న 2500 మందికి సీడ్స్‌, హ‌నీవెల్ స్వ‌చ్ఛంద సంస్థ‌లు నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేశాయి. ఈ కార్య‌క్ర‌మంలో సీపీ పాల్గొన్నారు. సీడ్స్‌, హ‌నీవెల్ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిథుల‌ను ఆయ‌న‌ అభినందించారు. ఎస్సీఎస్సీ స‌హ‌కారంతో గ‌త ఆరు నెల‌లుగా ఎన్నో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. 11 ల‌క్ష‌ల ఆహార ప్యాకెట్లు, రూ.1.25 ల‌క్ష‌ల విలువైన కూర‌గాయ‌లు పంపిణీ చేశామ‌న్నారు. ర‌క్తదాన శిబిరాలు, ప్లాస్మాదానం వంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌న్నారు. 

ట్రాన్స్ జెండ‌ర్స్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేస్తామ‌ని చెప్పారు. ట్రాన్స్‌జెండ‌ర్స్ కూడా స‌మాజంలో భాగ‌మే అని, వారిని చిన్న‌చూపు చూడోద్ద‌ని సూచించారు. ట్రాన్స్ జెండ‌ర్స్‌కి ఏవైనా స‌మ‌స్యులుంటే 100కు ఫోన్‌చేయాల‌న్నారు. 


logo