హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, పంట రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలతో రైతులకు భద్రత, నమ్మకం కల్పించామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన 2,601 రైతు వేదికల ద్వారా రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తూ… దాదాపు 13 లక్షల మంది రైతులు, అందులో 3 లక్షల మహిళా రైతులు నేరుగా శాస్త్రవేత్తలు, అధికారులతో సంప్రదింపులు జరిపేలా అవకాశాలు కల్పించామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన వ్యవసాయ సదస్సులో తెలంగాణ వ్యవసాయ ఘనతను ఆయన వివరించారు. తుమ్మల చెప్పిన ఘనతలన్నీ కేసీఆర్ హయాంలో సాధించినవే కావడం గమనార్హం.