హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ .. పార్టీ ఫిరాయింపులకు(ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం) వ్యతిరేకమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. ఈ మేరకు గురువారం మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ సోయం బాపూరావును కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తమ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని పేర్కొన్నారు.
అంతలోనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేలా.. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, మంచి ముహూర్తం చూసుకొని కాంగ్రెస్‌లో చేరతారని చెప్పడం గమనార్హం. రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వ సాధారణమని తెలపడం విస్మయానికి గురిచేస్తున్నది.