ఏసీబీకి చిక్కిన వాటర్‌షెడ్ పీవో
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీఆర్డీఏలోని వాటర్‌షెడ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీశ్‌రెడ్డి, రేగొండ మండల టెక్నికల్ ఆఫీసర్ రాజు ఏసీబీకి చిక్కారు.
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీఆర్డీఏలోని వాటర్‌షెడ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీశ్‌రెడ్డి, రేగొండ మండల టెక్నికల్ ఆఫీసర్ రాజు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రేగొండ, మల్హర్, పలిమెల మండలాల్లో భూగర్భజలాల పెంపు లక్ష్యంగా డీఆర్డీఏ ఆధ్వర్యంలో పీఎంకేఎస్‌వై 2.0 కింద రాక్‌ఫిల్ డ్యామ్‌లు, లూజ్ బోల్డర్స్, ఊటకుంటలు, సేద్యపు కుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మా ణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. రే గొండ మండలం భాగిర్థిపేట, గూడేపల్లి, మడతపల్లి, నారాయణపూర్, దుంపిల్లపల్లి, పొనగల్లు గ్రామాల్లో రూ.5కోట్ల విలువైన పనులు, మల్హర్ మండలంలో రూ.3 కోట్లు, పలిమెలలో రూ.3కోట్ల పనులు పూర్తి చేశారు. రేగొం డ మండలంలోని ఓ కాంట్రాక్టర్ చేసిన రూ.1.62 కోట్ల పనుల బిల్లులు క్లియర్ చే సేందుకు వాటర్‌షెడ్ పీవో సతీశ్‌రెడ్డి, టీవో రా జు లంచం డిమాండ్ చేశారు.
గత్యంతరం లేక ఆ కాంట్రాక్టర్ వారు చెప్పిన బ్యాంకు ఖా తాల్లో రూ.39 లక్షలు జమచేశాడు. మరో రూ.1.34 లక్షల బిల్లు ఫైల్ సైతం కమీషన్ చె ల్లిస్తేనే కదులుతుందని కాంట్రాక్టర్‌కు సూచించారు. బాధితుడు విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించాడు. బ్యాంక్ లావాదేవీల రికార్డులు, వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులను పరిశీలించి అవినీతిని జరిగినట్టు నిర్ధారించి పీవో సతీశ్‌రెడ్డి, టీఏ రాజును అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎల్. రాజు, ప్రభాకర్, పున్నం పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

