Kadiyam Kavya | ‘కావ్య నజీరుద్దీన్’కు ఎందుకు ఓటేయాలి?.. దళితులను అణచివేసిన కడియంకు బుద్ధి చెప్పాలి: అరూరి రమేశ్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ నజీరుద్దీన్‌ను పెండ్లి చేసుకొని గుంటూరు వాస్తవ్యురాలైన మహమ్మద్ కావ్య నజీరుద్దీన్‌కు వరంగల్ ప్రజలు ఎందుకు ఓటేయాలని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రశ్నించారు. గురువారం హనుమకొండలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. తాను వరంగల్ జిల్లా బిడ్డగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వర్ధన్నపేట ప్రజలకు సేవ చేశానని చెప్పారు.
- బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్
Kadiyam Kavya | వరంగల్, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ నజీరుద్దీన్‌ను పెండ్లి చేసుకొని గుంటూరు వాస్తవ్యురాలైన మహమ్మద్ కావ్య నజీరుద్దీన్‌కు వరంగల్ ప్రజలు ఎందుకు ఓటేయాలని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రశ్నించారు. గురువారం హనుమకొండలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. తాను వరంగల్ జిల్లా బిడ్డగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వర్ధన్నపేట ప్రజలకు సేవ చేశానని చెప్పారు.
కడియం శ్రీహరి దళితులను అణచివేశారని, ఆయన కుట్రలకు తాను కూడా బలయ్యాయని ఆరోపించారు. తాను మూడోసారి గెలిస్తే మంత్రి రేసులో ఆయన మంత్రి పదవికి ఎక్కడ అడ్డొస్తానోనన్న భయంతో తన ఓటమికి కుట్ర పన్నారని మండిపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను మాల, మాదిగలకు దక్కకుండా చేశారని విమర్శించారు. బీఆర్ఎస్లో ఉండి ఎస్సీ నేతలను బయటకు పంపించే వరకు కుతంత్రాలు చేశారని దుయ్యబట్టారు. ఏ పార్టీలో ఉన్నా కడియం శ్రీహరి దళితులను ఎదగకుండా అణచివేశారని ఆరోపించారు. ఇప్పుడు వరంగల్ ప్రజలు.. గుంటూరు కోడలు కావ్య నజీరుద్దీన్ కావాలో.. వరంగల్ బిడ్డ అరూరి రమేశ్ కావాలో ఆలోచించాలని కోరారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు అరూరి రమేశ్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

