సుబేదారి, ఆగస్టు 20 : మంత్రి కొండా సురేఖ బర్త్ డే వేడుకల్లో పాల్గొని ప్రజలకు ఇబ్బందుల కు గురిచేసిన ఏసీపీ నందిరాంనాయక్కు మంగళవారం షోకాజ్ నోటీస్ జారీ అయ్యింది. ఏసీపీ, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది సమక్షంలోనే మంత్రి అనుచరులు రాఖీ పండుగ రోజు రద్దీగా ఉన్న వరంగల్ కాశీబుగ్గ జంక్షన్ ప్రధాన రోడ్డును బ్లాక్ చేసి ప్రజలను ఇ బ్బందులకు గురిచేయడమే కాకుం డా రోడ్డుపై పటాకులు కాల్చడంతో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకువచ్చింది. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా, ఏసీపీ నందిరాం నాయక్‌కు మ ంగళవారం షోకాజ్ నోటీస్ జారీ చేశా రు. 5రోజుల్లో జవాబు చెప్పాలని అం దులో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ విషయమై సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమాను సీపీ విచారణకు ఆదేశించారు.