Ham Roads | హ్యామ్ రోడ్డు టెండర్ల కోసం మంత్రుల మధ్య వార్.. నలిగిపోతున్న అధికారులు
హ్యామ్ రోడ్డు టెండర్ల కోసం మంత్రుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో అధికారులు నలిగిపోతున్నారు. నా నియోజకవర్గంలో వేరే మంత్రి సంస్థకు టెండర్లు ఎలా ఇస్తారని, వెంటనే రద్దు చేయాలని అధికారులపై ఓ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
హైదరాబాద్ : హ్యామ్ రోడ్డు టెండర్ల కోసం మంత్రుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో అధికారులు నలిగిపోతున్నారు. నా నియోజకవర్గంలో వేరే మంత్రి సంస్థకు టెండర్లు ఎలా ఇస్తారని, వెంటనే రద్దు చేయాలని అధికారులపై ఓ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో టెండర్లు ఎలా రద్దు చేస్తారో చూస్తానంటూ టెండర్లు దక్కించుకున్న మరో మంత్రి చిందులు వేసినట్లు సమాచారం హ్యామ్ రోడ్ల టెండర్ల అంశంలో దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక మంత్రుల మధ్య గొడవలు తారస్థాయికి చేరినట్టు సమాచారం. ఓ మంత్రి ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలోనే ఉండగా, మరో మంత్రి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
అయితే, హ్యామ్ రోడ్ల టెండర్ల ప్రక్రియలో ఓ మంత్రి ఇలాకాలో మరో మంత్రి సంస్థకు టెండర్ కేటాయించడంతో రగడ మొదలైంది. నా ఇలాకాలో అతనికి టెండర్లు ఎందుకు ఇచ్చారు? రద్దు చేయండి అంటూ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇదే క్రమంలో టెండర్లు దక్కించుకున్న మరో మంత్రి నాకు కేటాయించిన టెండర్లు ఎలా రద్దు చేస్తారో చూస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వినికిడి. మొత్తానికి ఇద్దరు మంత్రుల గొడవలోఆర్అండ్బీ అధికారులు నలిగిపోతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ham Roads | హ్యామ్ రోడ్డు టెండర్ల కోసం మంత్రుల మధ్య వార్.. నలిగిపోతున్న అధికారులు
Maharastra | సీఎం ఫడ్నవీస్ ఇలాకాలో బీజేపీకి షాక్.. నాగ్‌పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన.. వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

