దేశంలో సంస్కరణలు తీసుకురావడం మీకు (బీజేపీకి) చేత కాదు. ఏదో నామ్కే వాస్తే ప్రకటనలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. అలాంటప్పుడు ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు. అమలు చేయడం చేత కానప్పుడు ఎందుకు హామీలు ఇవ్వాలి? అందుకే మీ హామీలను, ప్రకటనలను మేం సీరియస్గా తీసుకోం. సీఎంఐఈ డేటా ప్రకారం దేశంలో పట్టణ నిరుద్యోగం 7.9 శాతం, గ్రామీణ నిరుద్యోగం 6.54 శాతం ఉంది. ఐదేండ్లలో 60 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా…! అంటే ఏడాదికి 12 లక్షల ఉద్యోగాలు.. ఏటా 47.5 లక్షల మంది నిరుద్యోగులు పెరుగుతున్నారు. ఏటా 12 లక్షల మందికే ఉద్యోగాలిస్తే.. మిగిలిన వాళ్లంతా ఏం కావాలి. పకోడీలు అమ్ముకోవాలా? మీ హయాంలో 60 లక్షల ఎంఎస్ఎంఈ పరిశ్రమలు మూతపడ్డాయి. 84 శాతం మంది ప్రజలు ఆదాయం పడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మీ విధానాల వల్ల రెండేండ్లలో 4.6 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయారు.
-కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం