కరీంనగర్ : కరీంనగర్లో వాల్పోస్టర్లు(Wall posters) కలకలం రేపాయి. కేంద్ర హోం శాఖ సహాయ మత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్( Bandi Bhagirath) కనబడటంలేదని కరీంనగర్ వ్యాప్తంగా పోస్టర్లు వెలసిపోవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోక్స్ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన బండి భగీరథ్ కనిపించడం లేదని ఎవరికైనా కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరుతూ జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో భారీగా పోస్టర్లు వెలిశాయి.
కరీంనగర్ బస్టాండ్, తెలంగాణ చౌక్ , పార్కు వద్ద ఎస్ఆర్ఆర్ కాలేజ్ గేట్ ముందు ఇతర ప్రాంతాల్లో భగీరథ్ కనబడుట లేదని వెలిసిన పోస్టర్లు నగరంలో సంచలనం సృష్టిస్తోంది. ఓ ఇద్దరు కలిసిన ఇదే విషయంపై చర్చించుకోవడం గమనార్హం.
