హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): మేకిన్ తెలంగాణ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో చూడాలని ఉన్నదని, అంతటి సామర్థ్యం ఇక్కడి తయారీదారులకు ఉన్నదని నాలుగు దేశాల రాయబారులు పేర్కొన్నారు. ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్యవేత్తల బిజినెస్ సమ్మిట్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరాన్, బ్రెజిల్, పెరూ, డొమినికన్ రిపబ్లిక్ తదితర దేశాల రాయబారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
తెలంగాణ అన్ని వ్యాపారరం గాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ప్రశ ంసించారు. ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఒకేసారి నాలుగు దేశాల రాయబారులకు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉన్నదన్నారు. ఇరాన్లో భారత రాయబారి ధర్మేంద్ర,బ్రెజిల్లో భారత రాయబారి సురేశ్‌రెడ్డి, డొమినికన్ రిపబ్లిక్‌లోని భారత రాయబారి రాము, పెరూలో భారత రాయబారి సుబ్బారాయుడు మాట్లాడారు.