హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఓటరు అవగాహన పోటీలో పాల్గొని ఉత్తేజకరమైన నగదు బహుమతులు పొందాలని భారత ఎన్నికల సంఘం ఓటర్లకు పిలుపునిచ్చింది. ‘నా ఓటు -నా భవిష్యత్తు’ పోటీ కార్యక్రమంలో పాల్గొనడానికి దరఖాస్తు తేదీని ఈ నెల 31 వరకు పొడిగించింది. జాతీయస్థాయిలో క్విజ్, నినాదాలు, పాటలు, వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్ అంశాల్లో పోటీలు ఉంటాయని జీహెచ్ఎంసీ అధికారులు గురువారం తెలిపారు. వివరాలకు www.voterawarenesscontest.in చూడాలని సూచించారు.