మా ఓటు టీఆర్ఎస్కే. ఈటల రాజేందర్ ఏం చేసిండు మాకు. రోడ్లు వేయలేదు. లైట్లు వేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే సపరేట్ పార్టీ పెట్టకపోయినవ్. నీ స్వార్థం కోసం, ఆస్తులను దక్కించుకునేందుకే బీజేపీలో చేరినవ్. కేసీఆర్ వెనుకాలే అడుగులేస్తాం. ఆయనే మాకు దేవుడు. – ఇల్లందుల అనిల్, జూపాక గ్రామం
దళిత బంధు అమలు చేయడంతో అందరూ సంతోషిస్తున్నారు. కేసీఆర్ సార్ మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసే సమస్య లేదు. కేసీఆర్‌కే మా ఓటు.. దళిత బంధుతో మేమంతా సంతోషంగా ఉన్నాం.
– గుగ్గిళ్ల రాములు, జూపాక గ్రామం