పాలకుర్తి (జనగామ) : అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని మహిళా సంఘాల సహాయకులు (వీఓఏ) అన్నారు. వీఓఏల జీతాలు పెంచినందుకు గురువారం పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, రాయపర్తి, పెద్ద వంగర, కోడకండ్ల, తొర్రూరు మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్(CM KCR), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli Dayakar Rao) చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు .
వీఓఏలు సమస్యలను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. జీతాలతో పాటు యూనిఫాం కోసం నిధులు, ప్రతి మూడునెల్లకోసారి అమలవుతున్న రెనివల్ విధానాన్ని సవరిస్తూ ఏడాదికి పెంచడం హర్షనీయమని అన్నారు.
గతంలో తమను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ మానవీయ నిర్ణయంతోనే తమకు నేడు నెలజీతాలతో భరోసా దొరికిందని పేర్కొన్నారు. తమను ఆదరిస్తూ ఆసరానందిస్తూ భరోసాగా నిలిచినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని వారు వెల్లడించారు.