B Vinod Kumar | ఆ భూములివ్వాలని కేంద్ర రక్షణమంత్రికి వినోద్‌కుమార్ లేఖ..
B Vinod Kumar | కేంద్ర రక్షణశాఖ మంత్రికి తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ శనివారం లేఖరాశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్డు విస్తరణ పనుల కోసం ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
B Vinod Kumar | కేంద్ర రక్షణశాఖ మంత్రికి తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ శనివారం లేఖరాశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్డు విస్తరణ పనుల కోసం ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ బోర్డు విలీనం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ ఉన్నాయని, కంటోన్మెంట్ మాకు అప్పగిస్తే జీహెచ్ఎంసీ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు.
ట్రాఫిక్‌తో పాటు జనాభా పెరుగుతున్న కారణంగా అనేక రహదారులను ఏర్పాటు చేసి, కొత్త కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ రోడ్డు విస్తరణ పనులకు రక్షణశాఖ స్థలం ఇవ్వాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కోరారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్తగా రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్లతో పాటు డ్రైనేజీ సిస్టం మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, బోయినపల్లి నుంచి కొంపల్లి తరహాలో పారడైస్ నుంచి శామీర్‌పేట్ వరకు ఉన్న రక్షణ శాఖ స్థలాలు ఇస్తే ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకుంటామని గతంలోనే కోరామని, ఈ కారిడార్ నిర్మిస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందన్నారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

