గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 07, 2020 , 14:07:41

పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు హరితమయం

పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు హరితమయం

హైఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా టిలో పల్లె ప్రకృతి వనానికి భూమి పూజ చేశారు.  గ్రామంలో త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం మూడెకరాల స్థలాన్ని సేకరించినట్లు తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతాయని పేర్కొన్నారు. ఈ వనాలు గ్రామాలకు మరింత శోభను తీసుకువస్తాయన్నారు. అలాగే జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులను అధికారులు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు.


logo