భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 22 : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామ శివారులోని హెజోలో రసాయ న పరిశ్రమ సీ-బ్లాక్‌లో శుక్రవారం నైట్ షిఫ్ట్‌లో 18 మంది కార్మికులు పనిచేస్తున్నారు. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో నల్లగొండ జిల్లా పెద్దవూర మం డలం చిన్నగూడెం చెందిన చెన్ను నాగిరెడ్డి(31), ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్ నరేశ్‌కుమార్(29) మరణించారు.
పదిమంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం హెజోలో కెమికల్ కంపెనీ ఎదుట రాజకీయ నా యకులు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఒకో కార్మిక కుటుంబానికి రూ.5 కోట్ల చొప్పున పరిహారం చెల్లించాలని, బాధిత కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.