హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ) : విజయ డెయిరీ పాల ధర పెంచినట్టు రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ప్రకటించింది. లీటరు టోన్డ్ మిల్క్‌పై రూ.2, హోల్ మిల్క్ (6శాతం వెన్న)పై లీటర్‌కు రూ.4 చొప్పు న పెంచినట్టు సంస్థ జీఎం మల్లికార్జునరావు తెలిపారు. పెంచిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. పాల ఉత్పత్తి, సేకరణ, ప్యాకింగ్, రవాణా ఖర్చులు పెరిగినందున తప్పని పరిస్థితుల్లోనే ధరలు పెంచినట్టు జీఎం వెల్లడించారు. ధరలు పెంచినా ఇతర కంపెనీలతో పోలిస్తే విజయ పాల ధరే తక్కువగా ఉండటం గమనార్హం.