అధికారం అండతో అక్రమ మైనింగ్!
అధికారం తమ చేతిలో ఉన్నదనే ధీమాతో ఆ పార్టీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బామ్మర్ది సాగిస్తున్న అక్రమ మైనింగ్ గుట్టురట్టు అయ్యింది. ఎమ్మెల్యే బంధువు జోగుళాంబ గద్వాల జిల్లా గోన్‌పాడ్ శివారులో నిర్వహిస్తున్న వెంకటేశ్వర క్రషర్కు నిరుడు ఫిబ్రవరి నాటికి అనుమతి గడువు ముగిసింది. తిరిగి రెన్యువల్ చేయకుండానే అధికారం అండంతో యథావిధిగా యజమానులు మైనింగ్ కొనసాగిస్తున్నారు.
- ఎమ్మెల్యే బండ్ల బామ్మర్ది గుట్టురట్టు
- గద్వాలలోని క్రషర్‌పై విజిలెన్స్ దాడులు
- అనుమతి లేకుండా వ్యాపారం
- శాటిలైట్ ద్వారా బట్టబయలు
- టిప్పర్లు, మిషనరీ సీజ్.. ఏడీకి అప్పగింత
- మైనింగ్ వద్ద రెండు జిలెటిన్ స్టిక్స్ లభ్యం
- క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశాలు
- రూ.కోట్లలో జరిమానా వేసే అవకాశం
మహబూబ్‌నగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికారం తమ చేతిలో ఉన్నదనే ధీమాతో ఆ పార్టీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బామ్మర్ది సాగిస్తున్న అక్రమ మైనింగ్ గుట్టురట్టు అయ్యింది. ఎమ్మెల్యే బంధువు జోగుళాంబ గద్వాల జిల్లా గోన్‌పాడ్ శివారులో నిర్వహిస్తున్న వెంకటేశ్వర క్రషర్కు నిరుడు ఫిబ్రవరి నాటికి అనుమతి గడువు ముగిసింది. తిరిగి రెన్యువల్ చేయకుండానే అధికారం అండంతో యథావిధిగా యజమానులు మైనింగ్ కొనసాగిస్తున్నారు.
గత జూన్‌లో ఈటీఎస్(ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) సర్వే చేసి గుర్తించినా చర్యలు తీసుకోకపోవడంతో పక్కా ఆధారాలతో విజిలెన్స్ అధికారులు మంగళవారం క్రషర్ వద్ద శాటిలైట్ ద్వారా సర్వే నిర్వహించడంతో అసలు బండారం బయటపడ్డది. ఈ మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ఆదేశాల మేరకు అధికారుల బృందం మంగళవారం క్రషర్‌పై దాడులు చేసింది. అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని నిర్ధారణ కావడంతో క్రషర్‌ను సీజ్ చేశారు. ఏడాదిన్నరగా ఎలాంటి అనుమతులు లేకపోగా, సీనరేజీ చార్జీలు చెల్లించకుండా అక్రమంగా మైనింగ్ చేస్తున్నట్టు విజిలెన్స్ తనిఖీల్లో తేలింది. అక్కడున్న టిప్పర్లు, మిషనరీలను గద్వాల మైనింగ్ ఏడీకి అప్పగించారు. అలాగే రెండు జిలెటిన్ స్టిక్స్ దొరికాయి.

ఏడాదిన్నర నుంచి లక్షల క్యూబిక్ మీటర్లు అక్రమ బ్లాస్టింగ్‌తో పాటు పెద్ద ఎత్తున మైనింగ్ జరిపినట్టు తేలింది. ఏడాదిన్నర నుంచి అక్రమంగా తరలించిన క్రషర్ మెటీరియల్‌కు కోట్ల రూపాయల జరిమానా పడే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. కాగా, అనుమతులకు దరఖాస్తు పెట్టుకున్నామని.. వస్తాయనే ఉద్దేశంతో క్రషర్ సాగిస్తున్నామంటూ వారు బుకాయిస్తున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరిగాక అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారని, అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో కంగుతిన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో అక్రమ మైనింగ్ వ్యవహారం సాగడం.. ఆయన సొంత బామ్మర్ది అక్రమాలు బయటపడటం గద్వాలలో సంచలనం రేపింది. అయితే ఎమ్మెల్యేకు అధిష్ఠానంతో వ్యవహారం బెడిసికొట్టిందా? అని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

