జనగామ టౌన్, ఏప్రిల్ 27 : జనగామ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. కీలక డాక్యుమెంట్లు, రికార్డులు, ఫైళ్లను పరిశీలించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. ఆరు నెలల నుంచి కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ల గురించి ఆరా తీసినట్టు సమాచారం.
ఈ తనిఖీలపై జిల్లా రిజిస్ట్రార్ దీపక్ మాట్లాడుతూ.. సాధారణ తనిఖీల్లో భాగంగా విజిలెన్స్ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్స్, రికార్డులు, ఫైళ్ల పరిశీలనకు వచ్చినట్టు తెలిపారు. ప్రతి ఏటా అన్ని కార్యాలయాల్లో జరుగుతుందని పేర్కొన్నారు.