పింఛన్ పెంచకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తాం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను తక్షణమే పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందె రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- వీహెచ్పీఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ రాంబాబు హెచ్చరిక
ఖమ్మం వ్యవసాయం, జూన్ 19: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను తక్షణమే పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందె రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంపు ప్రకటన వెలువడకుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సంఘం నేతల రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం జిల్లాకు వచ్చిన వీహెచ్పీఎస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు సామినేని భవానీచౌదరి, రాష్ట అధ్యక్షుడు కాళ్ల జంగయ్య ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ భవనంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అందె రాంబాబు మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛన్‌ను రూ.4 వేల నుంచి రూ 6 వేలకు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, బీడీ కార్మికుల పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడస్తున్నా.. ఇప్పటికీ ఆ హామీ గురించి సీఎం రేంవంత్‌రెడ్డి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

