TSPSC | హైదరాబాద్ : ఈ నెల 13, 14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్(సీబీఆర్టీ) నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. హాల్ టికెట్లు నేటి నుంచి ఎగ్జామ్ ప్రారంభానికి 45 నిమిషాల ముందుకు వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రాక్టీసు కోసం వెబ్సైట్లో నమూనా పరీక్ష లింక్‌ను పొందుపరిచినట్లు పేర్కొంది. మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.